Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెట్ మీద ఇష్టంతో ఇక్కడికి రాలేదు: జెర్సీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకటేశ్

  • ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ అయ్యాను
  • ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది
  • హీరో పాత్ర స్ఫూర్తిదాయకం
టాలీవుడ్ లో క్రికెట్ అంటే పడిచచ్చే హీరోల్లో వెంకటేశ్ ఒకరు. హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు, జెండా పట్టుకుని స్టేడియంలో ఆయన చేసే సందడి అంతాఇంతా కాదు. కొన్నిసార్లు ఇతర నగరాలకు కూడా వెళ్లి తనకు ఇష్టమైన జట్లను ప్రోత్సహిస్తుంటారు.

ఇక అసలు విషయానికొస్తే, క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకటేశ్ తళుక్కుమన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిన్న రాత్రి జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన వెంకీ మాట్లాడుతూ, తాను క్రికెట్ అభిమాని కావడంతో ఈ కార్యక్రమానికి రాలేదని, సినిమాపై అభిమానంతోనే వచ్చానని స్పష్టం చేశారు. జెర్సీ మూవీ ఫస్ట్ లుక్ తనను ఎంతో ఆకట్టుకుందని, సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మతిపోయిందని అన్నారు. హీరో నానీని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుందని, ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నానీ నిజంగానే నేచురల్ స్టార్ అని కితాబిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయని, అలాగని వాటి నుంచి పారిపోకుండా ఎదుర్కొని నిలబడాలని అన్నారు. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ను చూపించారని వెంకటేశ్ చెప్పారు.
Tollywood
Venkatesh

More Telugu News